మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR ఫిల్మ్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడని చెప్పొచ్చు. చరణ్ నటించే నెక్స్ట్ ఫిల్మ్ పాన్ ఇండియా రిలీజ్ అవుతుండటం విశేషం. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ RC15 ఫిల్మ్ చేస్తున్నాడు. కాగా, తనకు సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాకు వచ్చేస్తున్నాడు రామ్ చరణ్.
తాజాగా చరణ్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ఆసక్తికర ట్వీట్ చేశాడు. సందీప్ M. భట్నాగర్ రచించిన ‘‘offspring’’ అనే పుస్తకం గురించి తెలుపుతూ ట్వీట్ చేశాడు. సదరు పుస్తకంలో జీవితం, సంతానం ఇంపార్టెన్స్ గురించి చక్కగా వివరించారని, పదునైన అంశాలను చక్కగా వివరించారని, ప్రతీ ఒక్కరు ఈ పుస్తకం చదవాలని తను సిఫారసు చేస్తున్నట్లు రామ్ చరణ్ పేర్కొన్నాడు.
ఇక ఈ ట్వీట్ చూసి నెటిజన్లు రామ్ చరణ్ కూడా పుస్తకాభిలాషి, పుస్తకాల పురుగని అంటున్నారు నెటిజన్లు. రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ‘ఆచార్య’ ఫిల్మ్ ఇటీవల విడుదలైంది. కాగా, ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై అనుకున్న స్థాయిని రీచ్ కాలేకపోయింది. రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC15 తర్వాత..‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో తన నెక్స్ట్ పిక్చర్ చేయనున్నారు.
"Offspring" by Sandeep M. Bhatnagar is a poignant tale of choices in life. It meticulously captures the consequences of choosing goals over love, family and traditions. Recommending this fascinating work to everyone!! pic.twitter.com/DTrEIdOc9C
— Ram Charan (@AlwaysRamCharan) May 11, 2022