ఆస్కార్ చరిత్రలో తెలుగు సినిమా తనకంటూ ఓ పేజీ రాసుకుంది. భారతీయ చలన చిత్రరంగంలో తిరుగులేని చరిత్ర రాసుకుంది. 95వ ఆస్కార్ వేడుకల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటను ఆస్కార్ అవార్డు వరించింది. ఈ పాటు హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ స్టెప్పులేసిన విషయం తెలిసిందే. దీని గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ ఏమన్నాడంటే..?
‘’మా జీవితాల్లోనే కాకుండా భారతీయ చలన చిత్ర చరిత్రలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఎంతో ప్రత్యేకమైనది. ‘ఆస్కార్’ అవార్డు సొంతమయ్యేలా చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేనింకా కలలోనే ఉన్న భావన కలుగుతోంది. రాజమౌళి, కీరవాణి.. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత విలువైన రత్నాలు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి మాస్టర్‌పీస్‌లో నన్ను భాగం చేసిన వారిద్దరికీ ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా ‘నాటు నాటు’ అనేది ఒక భావోద్వేగం. ఆ ఎమోషన్‌కు రూపమిచ్చిన గేయరచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్‌రక్షిత్‌కు ధన్యవాదాలు. నా బ్రదర్ ఎన్టీఆర్, కో-స్టార్ అలియాభట్‌కు ధన్యవాదాలు. తారక్.. నీతో మళ్లీ డ్యాన్స్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేయాలని ఆశపడుతున్నా. భారతీయ నటీనటులందరికీ ఈ అవార్డు సొంతం. మాకు ఎంతగానో సపోర్ట్ అందించిన అభిమానులందరికీ నా కృతజ్ఞతలు’’- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
We have won!!
We have won as Indian Cinema!!
We won as a country!!
The Oscar Award is coming home!@ssrajamouli @mmkeeravaani @tarak9999 @boselyricist @DOPSenthilKumar @Rahulsipligunj @kaalabhairava7 #PremRakshith @ssk1122 pic.twitter.com/x8ZYtpOTDN— Ram Charan (@AlwaysRamCharan) March 13, 2023