వివిఆర్ ఫస్ట్ డే ఎస్టిమేషన్ ఎంతో తెలుసా..!

-

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న సినిమా వినయ విధేయ రామ. శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా రిలీజ్ హంగామా భారీగానే ఉంది. ఈ సంక్రాంతికి వస్తున్న భారీ బడ్జెట్ మూవీతో పాటుగా భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీపై పరిశ్రమ అంతా ఈగర్ గా ఎదురుచూస్తుంది. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా 95 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా వివిఆర్ భారీగా రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా అంచనాలను బట్టి మొదటి రోజు కలక్షన్స్ ఎంత రాబట్టవచ్చో అంచనా వేస్తున్నా ట్రేడ్ పండితులు. ఇక వారి లెక్కల ప్రకారం రాం చరణ్ వినయ విధేయ రామ మొదటి రోజే 20 కోట్లు పక్కా తెస్తుందని అంటున్నారు. అయితే సంక్రాంతి సీజన్ కాబట్టి ఫెస్టివల్ హాలీడేస్ కూడా కలిసి వచ్చి వినయ విధేయ రామని బ్లాక్ బాస్టర్ బొమ్మ చేసే అవకాశం ఉంది. మరి సినిమా అసలు టాక్ ఏంటి అన్నది మరికొద్ది గంటల్లో తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news