సీబీఐ డైరెక్టర్‌గా తెలుగుతేజం మన్నెం నాగేశ్వరరావు బాధ్యతలు కొనసాగనున్నారు. గురువారం వరకు వివాదాలతో ముడిపడిన అలోక్ వర్మను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే సీబీఐ నూతన డైరెక్టర్, తదుపరి ఉత్తర్వూలు వెలువడే వరకు నాగేశ్వరావు ఆ పదవిలో కొనసాగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలో సీబీఐ ప్రత్యక డైరెక్టర్ రాకేశ్ ఆస్థాన, డైరెక్టర్ అలోక్ వర్మల మధ్య చెలరేగిన వివాదం దేశ వ్యాప్తంగా ఇటు రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే అవినీతి ఆరోపణలపై అలోక్ వర్మను బలవంతపు సెలవుపై పంపిన ప్రభుత్వం సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా అక్టోబర్ నెలాఖరులో నాగేశ్వర రావును నియమించారు. ఆ తర్వాత ఆయనకు అదనపు డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించారు. అయితే.. సుప్రీంకోర్టు ఆదేశాలతో రెండు రోజుల కిందటే వర్మ తిరిగి సీబీఐ డైరెక్టర్‌గా చేపట్టగా… 48 గంటలు గడవక ముందే మోడీ ప్రభుత్వం ఆయన్ను ఆ పదవిలో నుంచి తొలగిస్తూ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు పదవిలో కొనసాగనున్నారు.