చరణ్ వివిఆర్ సాంగ్ వస్తుంది

-

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న సినిమా వినయ విధేయ రామ. 2019 సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ మొదలు పెట్టారు చిత్రయూనిట్. సినిమా నుండి మొదటి సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. డిసెంబర్ 3న సాయంత్రం 4 గంటలకు చరణ్ వినయ విధేయ రామ సినిమా ఫస్ట్ సాంగ్ వస్తుంది.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో మొదటి ఫ్యామిలీ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. జయ జానకి నాయక సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఈమధ్యనే వచ్చిన టీజర్ కూడా మెగా ఫ్యాన్స్ ను ఉత్సాహపరచింది. చరణ్ కు జోడీగా కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కేథరిన్ త్రెసా ఐటం సాంగ్ కూడా ఉంటుందట.

రంగస్థలం తర్వాత రాం చరణ్ చేస్తున్న ఈ మూవీతో కూడా ఆ రేంజ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమా తో పాటుగా ఎన్.టి.ఆర్ తో ట్రిపుల్ ఆర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కూడా భారీ స్థాయిలో ఉండబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news