విద్యార్థులకు గుడ్ న్యూస్.. త్వరలోనే తెలంగాణలో మరో యూనివర్సిటీ..!

-

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గత ఏడాది డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కొత్త కొత్త మార్పులను తీసుకొస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కూడా మెరుగైన వైద్యం, విద్యను అందించేందుకు ప్రణాళికలను రచిస్తోంది. ముఖ్యంగా కోడంగల్ నియోజకవర్గంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయనున్నారు. మధిరలో కూడా మరో కళాశాల ఏర్పాటు చేయనున్నారు. దీంతో బీజేపీ నేతలు సీఎం, డిప్యూటీ సీఎం నియోజకవర్గాల్లోనే మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తే.. మిగతా నియోజకవర్గాల పరిస్తితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణలో స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే రాష్ట్రంలో రాజీవ్ గాంధీ స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. న్యాక్ సెంటర్ వద్ద మొత్వం 32 ఎకరాల విస్తీరణంలో స్కిల్ వర్సిటీ నిర్మిస్తామన్నారు. ఇక, కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. ఫార్మా దిగ్గజాలు సీఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వాలని కోరారు. రూ.32 వేల కోట్ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version