ఇస్మార్ట్ శంకర్.. పోకిరి-2 అంటున్నారే..!

-

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ కొన్నాళ్లుగా కెరియర్ లో సరైన సక్సెస్ లేక సతమవుతున్నాడు. టెంపర్ తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు కాని వాటిని హిట్ చేయడంలో మాత్రం పూరి వెనుకపడ్డాడు. తనయుడు ఆకాష్ తో చేసిన మెహబూబా కూడా ఫ్లాప్ అవడంతో నిర్మాతగా కూడా భారీ నష్టాలు చవిచూశాడు పూరి. ఇక కొంత గ్యాప్ తో ప్రస్తుతం రాం తో ఇస్మార్ట్ శంకర్ అంటూ ఓ సినిమా చేస్తున్నాడు పూరి జగన్నాథ్.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిన్న జరుపుకున్నారు. సినిమా సెట్స్ మీదకు వెళ్లక ముందే ఫస్ట్ లుక్ పోస్టర్ తో అదరగొట్టిన పూరి ఈ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చాటాలని చూస్తున్నాడు. అందుకే స్క్రిప్ట్ దగ్గర నుండి ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడట. అయితే ఇస్మార్ట్ శంకర్ పోకిరి-2 అంటూ వార్తలు వస్తున్నాయి.

పోకిరి సినిమాలో ట్విస్టుల్లానే ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కూడా అలాంటి ట్విస్టులు ఉంటాయట. సూపర్ స్టార్ మహేష్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిన పోకిరి రికార్డులు అందరికి తెలుసు. ఆ సినిమా పంథాలో వస్తున్న ఇస్మార్ట్ శంకర్ అటు పూరికి, ఇటు రామ్ కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news