Ram Setu : “రామసేతు” ట్రైలర్ రిలీజ్.. దుమ్ములేపిన అక్షయ్ కుమార్

-

అక్షయ్ కుమార్, సత్యదేవ్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ ప్రధాన తారఘనంగా రూపొందించిన చిత్రం ‘రామసేతు’. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబయిపోయింది. దీపావళి పురస్కరించుకొని అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఉత్కంఠ ట్రైలర్ ను మంగళవారం రిలీజ్ చేశారు. ట్రైలర్ ప్రకారం, అక్షయ్ కుమార్ ‘రామసేతు’ ను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చూపించారు. అక్షయ్ కు సత్యదేవ్, జాక్వలిన్ లు సహకరిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ ట్రైలర్‌ లో బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా చాలా బాగుంది. కాగా దీపావళి కానుకగా ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఇందులో అక్షయ్ కుమార్ ఆర్కియాలజిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అభిషేక్ శర్మ దర్శకత్వం వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news