విడాకులు తీసుకోబోతున్న రానా దంపతులు.. క్లారిటీ ఇచ్చిన రానా భార్య..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నిజం చెప్పాలి అంటే ఈ ఫ్యామిలీ అన్ని ఫ్యామిలీల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది.ఎందుకంటే వీరి కుటుంబానికి సంబంధించిన విషయాలను కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలనుకొని ఇప్పటివరకు ఎవరు చూడలేదని చెప్పాలి. ఇక తమ వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు గోప్యంగా ఉంచుతూ కుటుంబ సభ్యులను కనీసం తమ సినిమాల ఆడియో ఫంక్షన్ కి కూడా తీసుకురానంత గోప్యంగా ఉంచుతారని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి రానా ఆయన భార్య మిహికా బజాజ్ విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే ఎంతో అన్యోన్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇలా విడాకులు తీసుకోవడం ఏంటి అంటూ ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు.

నిజానికి సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న రానా గత కొంతకాలంగా సోషల్ మీడియాకి దూరంగా ఉండడంతో రానా వ్యక్తిగత జీవితం గురించిన ఇలాంటి పుకార్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.. రానా ఇలా సోషల్ మీడియాకి దూరంగా ఉండడానికి గల కారణం తనకి, తన భార్య మిహికా బజాజ్ కి మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. త్వరలోనే విడిపోయే అవకాశాలు ఉన్నాయని.. విడాకులు తీసుకోబోతున్నారని ఇలా రకరకాల పుకార్లు మీడియాలో గుప్పుమన్నాయి.కానీ ఈ పుకార్లన్నింటికీ పుల్ స్టాప్ పెడుతూ మిహికా బజాజ్ ఇవాళ తమ రెండవ వివాహ వార్షికోత్సవ సందర్భంగా తమ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇక మరోవైపు ఏమి లేకుండానే మీడియా ఇలాంటి పుకార్లను సృష్టిస్తోంది అంటూ మండిపడ్డారు. ఏది ఏమైనా ఎంతో అన్యోన్యంగా సంసారం చేసుకునే వారి మధ్యలో విడాకులు పుకార్లు సృష్టిస్తూ వారి జీవితాలలో గందరగోళం సృష్టించడం ఏమాత్రం సమంజసం అంటూ అభిమానుల సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.