ఈ దెబ్బతో రాశీ ఖన్నా కెరియర్ ఇరుకున పడ్డట్టేనా..?

-

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగకపోయినా ఒక మోస్తారుగా అందరి స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా తన కెరీర్ ను కొనసాగిస్తున్న ఈమె తెలుగులో లేటెస్ట్ గా నటించిన రెండు సినిమాలు కూడా నిరాశపరిచాయని చెప్పవచ్చు. మారుతి డైరెక్షన్లో గోపీచంద్ హీరోగా వచ్చిన పక్కా కమర్షియల్ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక శుక్రవారం విడుదలైన థాంక్యూ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోవడం గమనార్హం.

ఇక ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మళ్లీ రిస్క్ లో పడిందని రాశీ ఖన్నా చెప్పవచ్చు. ఇకపోతే ప్రస్తుతం ఈమెకు తెలుగులో ఏ సినిమాలోనూ అవకాశం రాలేదని తెలుస్తోంది. ఇక ఇలాగే ఉంటే ఈమె తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయని చెప్పవచ్చు. తమిళ్ లో మాత్రం ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నట్లు తాజా వార్తల ప్రకారం సమాచారం అందుతోంది. ఇక ప్రస్తుతం ధనుష్ హీరోగా తమిళ్లో నటిస్తున్న సర్దార్ సినిమాలో రాశి కన్నా హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాదు హిందీలో కూడా యోధ అనే సినిమాలో ఈమె నటిస్తున్నట్లు సమాచారం.

ఇక తెలుగులో అవకాశాలు లేకపోయినా తమిళ్, హిందీ పరిశ్రమలో మాత్రం రాశీ ఖన్నా భారీగా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. కానీ తెలుగులో ఈమె టాప్ హీరోయిన్గా కొనసాగాలని కలలు కంటున్నా. ఈమెకు మాత్రం సక్సెస్ రేట్ పెద్దగా లభించలేదు. కానీ గ్లామర్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ ఫోటోషూట్ తో మరింత పాపులారిటీని సంపాదించుకుంటుంది. ఇకపోతే వచ్చిన రెండు సినిమాలు కూడా విజయాన్ని అందించలేదు కాబట్టి ఇక తన నెక్స్ట్ సినిమా ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇక నెక్స్ట్ ఆఫర్ రాకపోతే తెలుగులో ఇరుకున పడ్డట్టే అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news