గ్లామర్ డోస్ పెంచడంతో రాశీ రేంజ్ మారినట్టేనా

Join Our Community
follow manalokam on social media

రాశీ ఖన్నా ఎంత ట్రై చేసినా హోమ్లీ ఇమేజ్ నుంచి బయటపడట్లేదు. కొత్త సినిమాలు రావట్లేదు. ఇక ఇలాగే ఉంటే కష్టమని, గేర్ మార్చేసింది రాశీ ఖన్నా. బౌండరీస్‌ అన్నింటిని పక్కనపెట్టి, గ్లామర్ గేట్లు ఎత్తింది. స్విమ్‌ సూట్‌తో సోషల్‌ మీడియాలో సునామి సృష్టిస్తోంది రాశి. మరి ఈ సునామితో రాశి బాధలన్నీ కొట్టుకుపోతాయా…

రాశీ ఖన్నా చాలా కాలంగా స్టార్ హీరోయిన్ హోదా కోసం పోరాడుతోంది. కానీ ఇప్పటివరకు ఈమెకి టాప్‌ లీగ్‌లో చోటు దక్కలేదు. ఎంత ట్రై చేసినా యంగ్‌స్టర్స్‌ దగ్గరే ఆగిపోతోంది. ఇక ‘వరల్డ్ ఫేమస్ లవర్’ డిజాస్టర్ అయ్యాక రాశీకి ఈ మీడియం రేంజ్ మూవీస్‌ కూడా తగ్గిపోయాయి. మారుతి-గోపీచంద్‌ సినిమాలో ఆఫర్ వచ్చిందనే ప్రచారం జరుగుతున్నా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.

రాశీ ఖన్నా ఇప్పటివరకు టాప్‌ హీరోల్లో జూ.ఎన్టీఆర్‌తో మాత్రమే సినిమా చేసింది. ‘జై లవకుశ’లో ఒక హీరోయిన్‌గా నటించింది రాశి. అయితే ఈ మూవీలో రాశి పెర్ఫామెన్స్‌కి పెద్దగా పేరు రాలేదు. కెరీర్‌లోనూ పెద్దగా వండర్స్ ఏం జరగలేదు. దీంతో మీడియం రేంజ్‌ హీరోలతోనే సర్దుకుంటోంది. కానీ ఇప్పుడీ అవకాశాలు రాట్లేదు. పైగా రాశీ పనైపోయిందనే కామెంట్స్‌ వస్తున్నాయి. దీంతో గ్లామర్ బండి ఎక్కుతోంది బెల్లం శ్రీదేవి.

రాశీ ఖన్నా రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ పోస్ట్ చేసింది. ఎంతో కాలం కష్టపడితేగానీ, ఈ లుక్‌ రాలేదని బికినీతో ఫోటో షేర్ చేసింది రాశి. ఇక ఇప్పటివరకు పెద్దగా ఎక్స్‌పోజ్ చెయ్యని రాశీ ఖన్నా, ఒకేసారి స్విమ్‌సూట్‌లో దర్శనమివ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. రాశీలో ఈ సడన్‌ చేంజ్‌కి కారణమేంటి.. అవకాశాల కోసమే ఇలా చేస్తోందా అని మాట్లాడుకుంటున్నారు.

TOP STORIES

రూపాయి ఫీజు.. రిటైర్డ్ టీచర్ క్లాస్..!

రిటైర్‌మెంట్ తీసుకున్న ఉద్యోగులు వృద్ధాప్య జీవితాన్ని ఏదోఒక కాలక్షేపంతో కానిచ్చేస్తుంటారు. మనవళ్లకు ఆటపాటలు నేర్పిస్తూ కాలం గడుపుతుంటారు. కానీ బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన 61ఏళ్ల లోకేశ్...