బాల‌కృష్ణ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన టాప్ యాంక‌ర్‌..

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులకు పండగే. గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘లెజెండ్’ మూవీ అంతకు మించిన సక్సెస్ సాధించింది. ఇక బాల‌య్య‌, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రం పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభించేశారు.

అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సినీ వర్గాల్లో తెగ చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఈ సినిమా కోసం నటీ, బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ కనిపిస్తారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. సినిమాలో ఓ ముఖ‌్య పాత్ర కోసం దర్శకుడు బోయపాటి రష్మీని అడిగారట. బాలయ్య సినిమాలో చాన్స్ రావడంతో అది కూడా బోయపాటి ఆమెను అప్రోచ్ కావంతో ఓకే చెప్పిందని సమాచారం. ఇది గ్లామర్ తో కూడిన ప్రత్యేక పాత్ర అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news