తెలుగులో వరుసగా రెండు సూపర్ హిట్లు అందుకుని మంచి పాపులారిటీ సంపాదించిన రష్మిక కన్నడ సినిమాలను కూడా కాదనే రేంజ్ కు వచ్చింది. కన్నడలో కిరాక్ పార్టీ సినిమా ద్వారానే హీరోయిన్ గా హిట్ అందుకున్న రష్మిక ఆ తర్వాత తెలుగులో ఛలో, గీతా గోవిందం సినిమాలు చేసింది. ప్రస్తుతం దేవదాస్, డియర్ కామ్రేడ్ సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. కన్నడ నటుడు రక్షిత్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక పెళ్లి మాత్రం క్యాన్సిల్ చేసుకుంది.
ప్రస్తుతం రక్షిత్ హీరోగా చేస్తున్న కన్నడ మూవీ వ్రిత్ర సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా చేయాల్సి ఉంది కాని రష్మిక ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. తెలుగులో వరుస అవకాశాలు రావడమే కాకుండా పెళ్లి కాదనుకున్న రక్షిత్ హీరోగా అంటే మళ్లీ కష్టమని భావించి అమ్మడు ఆ ప్రాజెక్ట్ కు గుడ్ బై చెప్పేసింది.
రష్మిక నిర్ణయాన్ని కన్నడ అభిమానులు మాత్రం తప్పు పడుతున్నారు. తెలుగులో అవకాశాలు ఎంత వచ్చినా మాత్రు భాషలో సినిమాలు ఎందుకు వదిలేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ లో మాత్రం రష్మికకు ఐదేళ్ల దాకా చేతినిండా సినిమాలు ఉండేలా పరిస్థితులు కనబడుతున్నాయి.