ఆత్మహత్యాయత్నం చేసిన రవీనా టాండన్.. కారణం..?

-

రవీనా టాండన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. బంగారు బుల్లోడు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె సల్మాన్ ఖాన్ తో మొదటిసారి హీరోయిన్ గా నటించి.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. దాదాపు పది సంవత్సరాల పాటు హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగిన రవీనా టాండన్ ఇటీవల పాన్ ఇండియా సినిమా కేజిఎఫ్ 2 సినిమాలో రమిక సేన్ పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా విజయవంతం కావడంతో ఈ పాత్రకి కూడా మంచి పేరు లభించింది. ఇక సినిమాల విషయంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన వ్యక్తి ఈమె..కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం రవీనా టాండన్ అనేక వివాదాల్లో నిలిచింది..

ఇక రవీనా పెళ్లి కాకుండానే ఇద్దరినీ దత్తత తీసుకోవడం కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. మరి ఈమె ప్రేమ వ్యవహారాలు కూడా తక్కువేమీ కాదు. ఆమె సినిమాలో నటిస్తున్నంత కాలం కూడా ఎంతోమంది హీరోలతో ప్రేమలో పడింది. కానీ రిలేషన్ లో ఉన్నది మాత్రం ముగ్గురి తోనే.. అందులో మొదటి హీరో అక్షయ్ కుమార్ .. వీరిద్దరూ సినిమాల్లో నటిస్తున్నప్పుడే డేటింగ్ చేయడం మొదలుపెట్టారు . అంతా సాఫీగానే సాగిన సమయంలో అనుకోకుండా వీరి బంధం తెగతెంపులు అయింది. ఆ తర్వాత అజయ్ దేవగన్ తో ప్రేమలో పడింది. అప్పటివరకు వీరి ప్రేమ బలంగా సాగినా కరిష్మా కపూర్ ఎంట్రీ ఇవ్వడం తో సీను మొత్తం మారిపోయింది.

అజయ్ దేవగన్ కరిష్మాతో డేటింగ్ మొదలుపెట్టి రవీనా ను దూరం పెట్టేశాడు. అది భరించలేని రవీనా ఆత్మహత్య ప్రయత్నం చేసింది . ఆ తర్వాత కొన్నాళ్లు డిప్రెషన్లోకి వెళ్లిపోయి.. తర్వాత అనిల్ తడానితో ప్రేమలో పడింది. వీళ్లు కూడా కొన్ని రోజులు ప్రేమించుకొని పెళ్లి కూడా చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట అన్యోన్యంగానే ఉంటుంది. వీరు దత్తత తీసుకున్న ఇద్దరు పిల్లలతో పాటు వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. మొత్తం నలుగురు పిల్లలు సంరక్షణ రవీనానే చూసుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news