ఆర్జీవీ నెక్స్ట్ సినిమా.. ”పవర్ స్టార్”..! ”పవర్ స్టార్” ఫస్ట్ లుక్ విడుదల..!

-

rgv confirms his next movies titled power star and releases first look
rgv confirms his next movies titled power star and releases first look

కరోనా కారణంగా సినిమాలు అన్నీ ఆగిపోయాయి సినిమాలు రిలీజ్ అవ్వడం లేదు షూటింగులకు ఛాన్స్ లేదు కానీ వర్మ రూటే సపరేటు..! అవసరమైన చర్యలు తీసుకుంటున్నాడు, షూటింగ్ చేసుకుంటున్నాడు, ఆన్ లైన్ లోనే సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు మిగితా దర్శకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. తను ఎక్కడుంటే అక్కడ వివాదం అతని చుట్టూ వైఫై లా ఉంటుంది. ఇక తాజాగా ఆయన చేసిన ట్వీట్ కూడా వివాదాస్పదంగానే ఉంది. నా నెక్స్ట్ సినిమా పేరు పవర్ స్టార్ అందులోని నటులు వీరే అంటూ ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. ఆ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

అయితే ఆయన కరోనా కారణంగా సినిమాలు ఆన్ లైన్ లో సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు కరోనా వైరస్, క్లైమాక్స్ , నేకేడ్  వంటి సినిమాలను ఆన్ లైన్ లో విడుదల చేసి బాగానే సంపాదింమ్చాడు. ఇప్పుడు ఇదే తరహాలో మరో సినిమా రిలీజ్ చేయబోతున్నానని  దాని పేరు పవర్ స్టార్ అని ఓ పోస్టు చేశాడు ఆ పోస్టులో నా సినిమా లోని క్యారెక్టర్స్ వీరే అని గజి బిజీగా pk, ms, nb, ts, ఓ రష్యా మహిళ, నలుగురు పిల్లలు అంటూ వారిని గుర్తుపట్టగలరా అనే కోణంలో నెటిజన్లను ప్రశ్నించాడు. ఆ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇక మరో ట్వీట్ లో పవర్ స్టార్ సినిమా లోని నటుడు ఇతనే అంటూ మరో వీడియో రిలీజ్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news