గృహ హింస కేసు అనగానే మనకు గుర్తొచ్చేది భార్యను భర్త చిత్రహింసలు పెట్టడం. కానీ, కోల్‌కతాలో మాత్రం ఇది రివర్స్ గా ఓ భర్త..భార్య చేతిలో హింసకు గురవుతున్నాడంట. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు విషయం ఏంటంటే..
పశ్చమ బెంగాల్ రాష్ట్రంలో కోల్ కతాకు చెందిన జ్యోతిర్మయిమజుందార్ ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ..భార్య, తల్లిదండ్రులతో నివాసం ఉంటున్నారు. కరోనా వైరస్ భయంతో కొంతకాలం క్రితం తన తల్లిదండ్రులను స్వగ్రామం బైద్యబతిలో వదిలిపెట్టి వచ్చాడు. కేంద్రం నిబంధనలు సడలించడంతో ఇటీవల మళ్లీ వారిని తన వద్దకు తెచ్చుకున్నాడు. ఇది..మజుందర్ భార్యకు నచ్చలేదు. వెంటనే సొంతూరులో వదిలిపెట్టాలని చెప్పేది. మజుందర్ వినిపించుకోలేదు. దీంతో భర్తను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది.
సిగిరెట్లతో కాల్చడం, పిన్నులతో గుచ్చడం, చెంపలు వాయించడం చేసేది. భార్య చిత్రహింసలు రోజురోజుకు పెరుగుతుండడంతో పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య ప్రతిరోజూ తనను హింసిస్తోందని, ఆమెపై గృహహింస కేసు కింద అరెస్ట్ చేయాలని కోరాడు. అంతేకాదు, ఆమె తనపై దాడిచేస్తున్న వీడియోలను వారికి చూపించాడు. అయినప్పటికీ పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో జ్యోతిర్మయి హైకోర్టును ఆశ్రయించాడు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
স্বামী নির্যাতন! শ্বশুর-শাশুড়িকে নিয়ে আপত্তি, সল্টলেকে বরকে বেদম পেটালেন ইঞ্জিনিয়ার স্ত্রী
স্বামী নির্যাতন! শ্বশুর-শাশুড়িকে নিয়ে আপত্তি, সল্টলেকে বরকে বেদম পেটালেন ইঞ্জিনিয়ার স্ত্রী
Posted by Zee 24 Ghanta on Friday, 26 June 2020