ఆడి ముఖం..కేఏ పాల్ వ్యాఖ్యలపై రామ్ గోపాల్ వర్మ రియాక్షన్ ఇదే..

-

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏ పని చేసినా మీడియాలో హైలైట్ అవ్వాలనుకుంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజెంట్ ఈయన ‘డేంజరస్’ మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.

ఈ నెల 8న చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆర్జీవీ తన సినిమాలో లీడ్ రోల్స్ ప్లే చేసిన అప్సరా రాణి, నైనా గంగూలీతో పాటు మూవీ యూనిట్ సభ్యులతో మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ తెలుగు మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపైన కామెంట్స్ చేసిన కేఏపాల్ వ్యాఖ్యలపైన స్పందించారు.

ప్రజాశాంతి పార్టీ నేత కేఏపాల్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ పైన నెగెటివ్ కామెంట్స్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ చెత్త సినిమాని కేఏపాల్ అన్నారు. ఆ మాటలను ఇంటర్వ్యూలో యాంకర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వద్ద ప్రస్తావించారు. వాటిపైన ఆర్జీవీ స్పందించారు. ఆడి ముఖం.. అంటూ కేఏపాల్ ను ఉద్దేశించి వర్మ వ్యాఖ్యానించారు. ‘ఆర్ఆర్ఆర్’ సినమా ఫెంటాస్టిక్ అని వర్మ క్లారిటీనిచ్చారు. ‘బాహుబలి 2’ను మించి రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ను చిత్రీకరించారని పేర్కొన్నారు.

‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఆధారం కొంత చేసుకుని తాను ‘డేంజరస్’ ఫిల్మ్ లో అప్సరా రాణి, నైనా గంగూలీలను తీసుకున్నట్లు వివరించాడు. అయితే, ఇందులో లిప్ లాక్స్ పెట్టడం వెనుక వారి మధ్య ఉన్న క్లోజ్లీనెస్ తెలపడమే ఉద్దేశమని అన్నాడు.

లెస్బియన్ క్రైమ్ డ్రామాగా వస్తు్న్న ఈ పిక్చర్ ప్రమోషన్స్ లో ఆర్జీవీ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ఇద్దరూ సూపర్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పాత్రలను రాజమౌళి బ్యాలెన్స్ చేశారని తాను భావిస్తున్నట్లు వర్మ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news