లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫస్ట్ డే కలక్షన్స్.. వర్మ లెక్క తప్పలేదు..!

-

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ అసలు కథగా వచ్చిన సినిమా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. రిలీజ్ ముందు వరకు ఎన్నో వివాదాలు సృష్టించిన ఈ సినిమా శుక్రవారం ఏపి తప్ప మిగతా అన్ని ఏరియాల్లో రిలీజైంది. అన్నిచోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటి రోజు వసూళ్లు బాగానే రాబట్టింది. యూఎస్ లో 125 స్క్రీన్స్ లో రిలీజైన ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారా 90,214 డాలర్స్ వసూళ్లు రాబట్టింది.

యూఎస్ లో ఇప్పటివరకు 1,45,928 డాలర్స్ వసూళు చేసింది. ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా 4,82,599 డాలర్స్ రాబట్టగా.. మహానాయకుడు 1,02,234 డాలర్స్ కలెక్ట్ చేసింది. హైదరాబాద్ లో ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో అన్ని షోలు హౌజ్ ఫుల్ కావడం విశేషం. మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా వీకెండ్ లో అదరగొట్టే వసూళ్లు సాధించేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news