పవన్‌ కళ్యాణ్‌ ఓటర్లను నిందిస్తున్నాడు – RGV

-

 

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతీ విషయమై తన అభిప్రాయాలను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదిక గా ట్వీట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవుతుంటారు. ముఖ్యంగా రాజకీయాల్లో వేలు పెడుతూ ఉంటారు.

అయితే, తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో ట్వీట్ చేశారు. ‘సినిమా ఫ్లాప్ అయినందుకు ప్రేక్షకులను నిందించే ఓ సినిమా నిర్మాతలాగా… పవన్ కళ్యాణ్ తనను, తన పార్టీని గెలిపించినందుకు ఓటర్లను నిందిస్తున్నారు’ అని పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేస్తూ RGV ట్వీట్ చేశారు. ఆర్జీవి ట్వీట్ పై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news