రాజమౌళిని ట్రోల్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఫోటో వైరల్ !

వివాదాల‌కు కేర్ ఆఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఆయ‌న ఏది చేసినా.. వివాదంలాగే ఉంటుంది. ఆయ‌న నోటి దూలతో ఆయ‌న డైలాగ్స్.. ఆయ‌న చేతి దూలతో ట్వీట్స్ ఎప్పుడు వార్త‌లో ఉంటాయి. ఇక ట్విట్ట‌ర్ లో వ‌ర్మ చేసే.. హంగామా అంతా ఇంతా ఉండ‌దు. ఎప్పుడు ఎదో ఒక ట్వీట్ పెట్టి వివాదాల‌ను రేపుతారు. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న ట్వీట్స్ కాస్త ఎక్కువ‌గానే వ‌స్తున్నాయి. కేఏ పాల్ పై ఫోక‌స్ పెట్టి ఈ మ‌ధ్య కాలంలో వ్య‌గ్యంగా ట్వీట్స్ చేస్తున్నారు. తాజా గా రామ్ గోపాల్ వ‌ర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారుతుంది.

టాలీవుడ్ సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని టార్గెట్ చేస్తూ తాజాగా పోస్ట్ పెట్టాడు వర్మ. “వెల్ రాజమౌళి సార్. మీకు ఎన్టీఆర్, రామ్ చరణ్, లాంటి బాయ్స్ ఉంటే… నాకు నైనా గంగూలీ, అప్సర రాణి లాంటి డేంజరస్ గర్ల్స్ ఉన్నారు” అంటూ ట్వీట్ చేసాడు. అంతే కాదు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కలిసి ఉన్న ఫోటో తో పాటు.. అప్సరా, నైనా లతో తాను కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేశాడు వర్మ. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.