ఎన్నికలు అయిపోయాక మళ్లీ నాగబాబు, రోజాలు యథావిధిగా జబర్దస్త్ షోలకు వచ్చారు. తిరిగి ఈ రెండు షోలకు యథాతథ స్థితి వచ్చింది. అయితే ఇకపై ఈ షోలకు రోజా మాత్రం పర్మినెంట్‌గా దూరం కానున్నారట.
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కార్యక్రమాలకు నాగబాబు, రోజాలు జడ్జిలుగా లేనప్పుడు షో రేటింగ్స్ ఎంతగా పడిపోయాయో అందరికీ తెలిసిందే. మొన్నా మధ్య ఎన్నికల ఈ సందర్భంగా దాదాపుగా రెండు నెలల పాటు ఈ ఇద్దరూ ఈ రెండు షోలకు దూరమయ్యారు. దీంతో వీరి స్థానంలో సంఘవి, మీనా వంటి నటులు కొద్ది రోజుల పాటు జడ్జిలుగా ఉన్నారు. అయితే నాగబాబు, రోజాలు లేనంత కాలం ఈ రెండు షోలను జనాలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మల్లెమాల యాజమాన్యానికి ఏం చేయాలో తెలియలేదు.
అయితే ఎన్నికలు అయిపోయాక మళ్లీ నాగబాబు, రోజాలు యథావిధిగా ఈ షోలకు వచ్చారు. తిరిగి ఈ రెండు షోలకు యథాతథ స్థితి వచ్చింది. అయితే ఇకపై ఈ షోలకు రోజా మాత్రం పర్మినెంట్‌గా దూరం కానున్నారట. అవును, షాకింగ్‌గా ఉన్నా ఇప్పుడీ వార్త మల్లెమాల యాజమాన్యాన్ని కలవరపెడుతున్నదట. రోజా వెళ్లిపోతే ఆమె స్థానంలో మళ్లీ ఎవరిని జడ్జిగా తీసుకురావాలా.. అని ఆ సంస్థ ఆలోచిస్తోందట. దీంతో ఈ రెండు కామెడీ షోలపై మరోసారి ప్రభావం పడుతుందని మల్లెమాల యాజమాన్యం కలత చెందుతోందట.
ఇక రోజా జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలకు పర్మినెంట్‌గా గుడ్‌బై చెప్పడం వెనుక పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఏపీఐఐసీ చైర్ పర్సన్‌గా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ఆ పదవిలో ఆమెకు పెద్దగా పనిలేదు. ఎందుకంటే ఆమె మొన్నీ మధ్యే కొత్తగా ఆ పదవి చేపట్టారు. అయితే ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని చెప్పి సీఎం జగన్ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించడంతో.. రోజా ఇకపై ఏపీఐఐసీ చైర్ పర్సన్ బాధ్యతల్లో తలమునకలవుతారని తెలుస్తోంది. ఎందుకంటే పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే ప్రతినిధులతో మాట్లాడడం, వాటి కార్యకలాపాలను పర్యవేక్షించడం, పరిశ్రమలకు అనుమతుల జారీ… తదితర అనేక అంశాలలో ఏపీఐఐసీ చైర్ పర్సన్ కీలకపాత్ర వహించాల్సి ఉంటుంది కనుక.. ఆ పనుల్లో రోజా బిజీ అయితే.. ఇక ఈ షోలలో పాల్గొనడం కష్టతరమవుతుంది. అందుకనే రోజా ఇక ఈ షోలకు పర్మినెంట్‌గా గుడ్ బై చెబుతారని తెలుస్తోంది. మరి ఈ విషయంపై స్పష్టత రావాలంటే కొద్ది రోజుల పాటు వేచి చూడక తప్పదు..!