సోమవారం ఉదయమే ఆయన తన ఆఫీసుకు వెళ్లి చీపురు పట్టుకొని… తను కూర్చునే రూమ్ ను తానే శుభ్రం చేసుకున్నారు. అంతే కాదు.. ఆఫీసు మొత్తం ఊడ్చి శుభ్రం చేసి వెళ్లి తన సీటులో కూర్చున్నారు.
అది 1993 వ సంవత్సరం. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా ఎత్మాద్ పూర్ లో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గా పని చేస్తున్నారు ఆయన. అదే సమయంలో పారిశుద్ధ్య కార్మికులు తమకు జీతాలు పెంచాలంటూ సమ్మె చేస్తున్నారు.
సోమవారం ఉదయమే ఆయన తన ఆఫీసుకు వెళ్లి చీపురు పట్టుకొని… తను కూర్చునే రూమ్ ను తానే శుభ్రం చేసుకున్నారు. అంతే కాదు.. ఆఫీసు మొత్తం ఊడ్చి శుభ్రం చేసి వెళ్లి తన సీటులో కూర్చున్నారు. అప్పుడు అంతా ఆయన వైపు అదోలా చూశారు. కొందరు రిపోర్టర్లు కూడా ఆయన చేసే పనిని చూసి ముక్కున వేలేసుకున్నారు.
కార్మికులు సమ్మె చేశారు. వాళ్లకు కావాల్సినవి ఇచ్చేదాక పనిలోకి దిగేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. వాళ్లకు ఎంత నచ్చచెప్పినా వినలేదు. ఏం చేస్తాం. అక్కడి స్థానికులను పిలిచి.. కార్మికుల కోసం ఎదురు చూసే కంటే.. మీ చెత్తను మీరే శుభ్రం చేసుకోండి అని చెప్పా.. అందరూ పక్కున నవ్వారు. చెబితే కాదు.. చేసి చూపిస్తేనే వాళ్లు మారుతారు అనిపించింది. అందుకే.. నేను చొరవ తీసుకున్నాను. ముందుగా నా ఆఫీసును నేను శుభ్రం చేసుకోవడం ప్రారంభించాను… అంటూ తన పాతరోజులను గుర్తు తెచ్చుకున్నారు డాక్టర్ పాండే. ఇప్పుడు ఆయన ఘజియాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ గా పని చేస్తున్నారు.
నా ఆఫీసును నేను క్లీన్ చేసుకోవడమే కాదు.. సిటీలోని చెత్తను కూడా శుభ్రం చేయడానికి నేను పూనుకున్నాను. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె వలన సిటీలో చెత్త పేరుకుపోవడంతో కంపు వాసనను ప్రజలు భరించలేకపోయారు. నేను చొరవ తీసుకోవడం చూసి కొందరు నాతో పనిచేసే అధికారులు నాతో చేయి కలిపారు. అక్కడి స్థానికులు కూడా ముందుకొచ్చారు. అందరం కలిసి మున్సిపాలిటీలోని చెత్తనంతా శుభ్రం చేశాం. అలాగే నాలుగైదు రోజుల పాటు ప్రతిరోజు కొంత సమయం చెత్తను శుభ్రం చేయడానికి కేటాయించాం. చెత్తను మేమే శుభ్రం చేయడానికి గమనించిన పారిశుద్ధ్య కార్మికులు.. తమ సమ్మెను విరమించి వచ్చి పనుల్లో చేరారు. అది నాకు స్ఫూర్తినిచ్చింది. అప్పటి నుంచి నేను పనిచేసే ఆఫీసును నేను శుభ్రం చేసుకుంటున్నా. దాని కోసం నా ఆఫీసు సమయం కంటే 10 నిమిషాల ముందుగానే ఆఫీసుకు వచ్చి నా రూమ్ శుభ్రం చేసుకుంటా. నా ఆఫీసు బయట చీపురుకట్ట, వైపర్, డస్ట్ బిన్ ఉంటాయి.. అంటూ చెప్పుకొచ్చారు అజయ్ శంకర్ పాండే.
పాండే ఆఫీసుకు బయట ఓ బోర్డు ఉంటుంది. దాంట్లో ఏమని రాసి ఉంటుందంటే… నా ఆఫీసును నేనే శుభ్రం చేసుకున్నా. ఇక్కడ చెత్త వేసి నాపనిని ఇంకాస్త పెంచకండి.. అంటూ ఉంటుంది.
వావ్.. సూపర్ కదా. ఐఏఎస్ హోదా వ్యక్తి… జిల్లా మెజిస్ట్రేట్ గా పనిచేస్తూ తన ఆఫీసును తానే ప్రతిరోజూ శుభ్రం చేసుకోవడం అనేది నిజంగా గొప్ప పని.