దుమ్ములేపుతున్న RRR కలెక్షన్స్.. ఒక్కరోజే 120 క్రాస్ !

టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. దాదాపు మూడేళ్ల పాటు ఈ మూవీ కోసం సినీ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేశారు. మంచి టాక్ రావడంతో ఈ మూవీ రికార్డుల వేటకు బయలు దేరింది. అటు సినీ తారలు, రాజకీయ నాయకులు కూడా ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. అయితే  RRR అన్ని భాషలలో  మొదటి రోజు 124.00 Cr ఇండియా నికర సంపాదించిందని సమాచారం అందుతోంది.

AP/TG గ్రాస్: 100 Cr కాగా షేర్: 70.00 Cr ముందస్తు అంచనాలు. ఇదే ఆల్-టైమ్ రికార్డ్ కావడం విశేషం.
నైజాం షేర్: 23.30 కోట్లు.. ఆల్-టైమ్ రికార్డ్
నెల్లూరు షేర్: 3.01 కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్
హిందీ నెట్: 18.00 కోట్లు (22.00 కోట్ల స్థూల) * ప్రారంభ అంచనాలు
ఇతర రాష్ట్రాలు: 29.00 కోట్ల స్థూల (తొలి అంచనాలు)
ప్రపంచవ్యాప్త గ్రాస్: 70 కోట్లు * సంపాదించవచ్చు