ఎన్టీఆర్ భీమ్ వీడియో సాధించిన అరుదైన రికార్డు..

-

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా నుండి రిలీజైన ఎన్టీఆర్ భీమ్ వీడియో అరుదైన రికార్డుని దక్కించుకుంది. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ విడుదలైనప్పటి నుండి వరుసపెట్టి రికార్డులు దక్కించుకుంటూనే ఉంది. ఇప్పటి వరకూ ఈ టీజర్ మిలియన్ కి పైగా లైకులు వచ్చాయి. లక్షకి పైగా కామెంట్లు వచ్చాయి. ఈ రెండు రికార్డులతో పాటు తాజాగా, వ్యూస్ పరంగా 30మిలియన్లు దాటి అత్యంత వేగంగా ఆ సంఖ్యని చేరుకున్న టీజర్ గా రికార్డు నెలకొల్పింది.

ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమా టీజర్ కూడా ఇంత తక్కువ టైమ్ లో ఆ ఫీట్ సాధించలేదు. మొదటిసారిగా ఎన్టీఆర్ భీమ్ వీడియోకి రికార్డు లెవెల్లో వ్యూస్ పడుతున్నాయి. సినిమా అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కరోనా టైమ్ లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, చకచకా పూర్తి చేస్తున్నారు. కీరవాణీ సంగీతం అందిస్తున్న ఈ సినిమా డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో రూపొందుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news