అల్లూరోడి గురించి ఎన్టీవోడు చెప్తుంటే… సూరీడు తాపానికి సందమామ కరిగినట్టు ఉండాది…!

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రౌద్రం, రణం, రుధిరం అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా గురించి ఏ చిన్న వార్త వచ్చినా సరే టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా చూస్తుంది. ప్రతీ విషయాన్ని ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా తాజాగా చిత్ర యూనిట్ ఒక టీజర్ విడుదల చేసింది.

రామ్ చరణ్ కి సంబంధించిన టీజర్ ని విడుదల చేసారు. ఈ టీజర్ లో రామ్ చరణ్ గురించి ఎన్టీఆర్ చెప్పడం చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ నేపధ్యంలోనే సోషల్ మీడియాలో ఈ టీజర్ ని కొనియాడుతూ ఒక అభిమాని పోస్ట్ చేసాడు. తాను ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమాని కాదంటూ ఈ పోస్ట్ చేసాడు. “నేను ఎన్టీఆర్ అభిమాని కాదు, అలా అని రామ్ చరణ్ అభిమానినీ కాదు. ఇందాకే టీజర్ చూసా, ఊపేసింది సామీ.

“ఏమప్పా తారక రామా… నీ అన్న గురించి నువ్వు చెబుతాంటే నా రోమాలు నాట్యమాడాయి. సూరీడు ఒక్కసారిగా పొంగి మండినట్టు ఉండాది. సందమామ సూరీడు తాపానికి కరిగినట్టు ఉండాది. ముసలెద్దు మృగశిర కార్తికి రంకేసినట్టు ఉండాది. గోదారి తీరంలో పులస సేతికి దొరికినట్టే దొరికి జారినట్టు ఉండాది. అల్లూరోడి గురించి ఎన్టీవోడు చెబుతాంటే మెరుపు అలా మొహం మీద నుంచి జారీ గోదారిలో కలిసిపోయినట్టు ఉండాది.”