కెసిఆర్ షాకింగ్ నిర్ణయం…!

కెసిఆర్ దండం పెట్టి చెప్పారు… విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి మర్యాదగా లొంగిపోవాలి అని. లేకపోతే మాత్రం తర్వాత కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. కాని చాలా మంది మాత్రం మొండిగా ఆయన మాట వినలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి మీడియా ముందుకి వచ్చి చెప్పినా సరే ఆయన మాటను లెక్క చేయలేదు కొందరు. ఇప్పుడు వారి వలనే తెలంగాణాలో కరోనా వైరస్ సోకింది.

ఈ నేపధ్యంలోనే సిఎం కేసీఆర్ కీలక నిర్ణయ౦ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వాళ్ళను గుర్తించాలని కెసిఆర్ సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంది. అలా వచ్చేవారికి జియో ట్యాగింగ్ ఇవ్వబోతోంది. అసలు దాని ఉద్దేశం ఏంటీ అంటే… విదేశాల నుంచి వచ్చిన వాళ్ల చేతులకు బ్యాండ్ వేస్తారు. దానికి ఓ నంబర్ లాంటిది ఇస్తారు. జీపీఎస్ లొకేషన్‌తో పనిచేస్తుంది. దీనితో వాళ్లు ఎక్కడికి వెళ్లినా… జియో ట్యాగింగ్ ద్వారా ప్రభుత్వానికి తెలిసిపోతుంది.

విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు ఇంటి నుంచి 50 మీటర్ల దూరం వెళ్లారంటే ఇక వాళ్ళ గురించిన సమాచారం… పోలీస్ కంట్రోల్ రూంకి వెంటనే మెసేజ్ వెళ్లిపోతుంది. వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులు అప్రమత్తమై… సదరు వ్యక్తిని తమ అదుపులోకి తీసుకుంటారు. అవసరమైతే క్రిమినల్ కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దీని కోసం ప్రత్యేక యాప్ ని కూడా తయారు చేసారు.