
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఈ వేడుక జరిగింది. తెలుగు రాష్ర్టాల గవర్నర్ నరసింహన్ కేసీఆర్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. కేసీఆర్‌తో పాటు మహమూద్ అలీ కూడా మంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం గవర్నర్ నరసింహన్ సీఎం కేసీఆర్‌కు బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ఫ్యామిలీ, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ నాయకులు హాజరయ్యారు. సరిగ్గా మధ్యాహ్నం 1.25 గంటలకు కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ తెలుగులో ప్రమాణస్వీకారం చేయగా.. మహమూద్ అలీ మాత్రం ఉర్దూలో ప్రమాణం చేశారు.