రాజ‌మౌళి ఆర్ ఆర్ ఆర్ కోస‌మే ఆమెరికాకి !

-

రాజ‌మౌళి ఏ సినిమా చేసినా మీడియాకి అప్ డేట్స్ ఇవ్వ‌డానికి అస్స‌లు ఒప్పుకోడు. చెప్పేస్తే కిక్ ఏముంటుంది. రిలీజ్ వ‌రకూ అటెన్ష‌న్ అంతా త‌న మీద‌నే ఉండాల‌ని తాప‌త్ర‌య‌ప‌డ‌తాడు. ఆ కార‌ణంగా మీడియాని చిన్న చూపు చూస్తున్నాడ‌ని అనే భావ‌న కొంద‌రిలో ఉంది. బాహుబ‌లి సినిమా స‌మ‌యంలో చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన త‌ర్వాత ఒకే ఒక్క ప్రెస్ మీట్ పెట్టి విష‌యాలు వెల్ల‌డించాడు. అదీ సినిమా రిలీజ్ ముందు. దీంతో జ‌క్క‌న్న‌పై వ్య‌తిరేక వార్త‌లు అప్ప‌ట్లో గా బాగానే వ‌చ్చాయి. కొన్ని ప‌త్రిక‌ల‌కే..వెబ్ సైట్ల‌కు ప్ర‌త్యేక ఇంట‌ర్వూలు ఇవ్వ‌డం…ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డం వంటివి జ‌రిగాయి. ఆ కార‌ణంగా బాహుబ‌లికి స‌రైన రేటింగ్ లు కూడా ఇవ్వ‌లేద‌ని రూమ‌ర్ వినిపించింది.

S S Rajamouli’s clarification about USA

దీంతో బాహుబ‌లి-2 ప్ర‌క‌ట‌న‌లు విష‌యంలో జాగ్ర‌త్త ప‌డ్డాడు కానీ..మీడియాతో మాత్రం ఒక్క‌సారే ఇంట‌రాక్ట్ అయ్యాడు. కార‌ణాలు ఏవైనా అత‌నిపై వ్య‌తిరేక‌త అయితే ఉంది. అప్ప‌టి నుంచి దాన్ని చెరుపుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. అందుకే ఆర్ ఆర్ ఆర్ ని ఎప్ప‌టికీప్పుడు మీడియాకి ప‌రిచయం చేస్తున్నాడు. కొద్ది భాగం షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత హీరోలిద్ద‌రితో స‌హా తాను మీడియా ముందు కూర్చొన్నాడు. అడిగిన ప్ర‌శ్న‌ల‌కు చ‌క్క‌గా స‌మాధానాలిచ్చాడు. అయితే ఇప్పుడు జ‌క్క‌న్న మ‌రోసారి ఆర్ ఆర్ ఆర్ కి సంబంధించిన ఓ టాప్ సీక్రెట్ దాచేసాడ‌ని రూమ‌ర్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న అమెరికాలో ఉన్నారు. అంతా తానా స‌భ‌ల‌కు వెళ్లార‌ని అనుకుంటున్నారు.

కీర‌వాణి విభావ‌రి ఉన్న నేప‌త్యంలోనే హాజ‌ర‌య్యాడ‌ని ప్ర‌చారం సాగుతోంది.అయితే వ్య‌క్తిగ‌త ప‌నిమీద వ‌చ్చాను త‌ప్ప తానా స‌భ‌ల‌కు కాద‌ని వివ‌ర‌ణ ఇచ్చాడు. అయితే ఇది అస‌లు కార‌ణం కాద‌ని ఆర్ ఆర్ ఆర్ కి సంబంధించిన ముఖ్య‌మైన ప‌నిమీద వెళ్లార‌ని మ‌ణికొండ‌లోని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది. ఆ స‌స్పెన్స్ రివీల్ చేసేస్తే క్యూరియాసిటీ ఉండ‌ద‌ని…అందుకే కార‌ణ‌మం మార్చి చెప్పార‌ని అంటున్నారు. మ‌రి ఇందులో నిజ‌మెంత‌న్న‌ది? తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news