యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన `సాహో రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది. ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాకాలు చేస్తున్నారు. ప్రభాస్ క్రేజ్ దృష్ట్యా ఇండియా సహా, విదేశాల్లో పెద్ద స్కేల్ లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు సహా తమిళ్, హిందీలోనూ పోటీ పడి రిలీజ్ చేస్తున్నారు. అయితే తెలుగు రాష్ర్టాల్లో మొత్తం వారం రోజుల పాటు సాహో మేనియా కొనసాగించాల్సిందేనని స్ర్టాంగ్ డెసిషన్ తీసుకున్నారుట. ప్రతీ సిటీలోనూ…ప్రతీ థియేటర్ లోనూ..మారుమూల చిన్నపాటి టౌన్స్ లో సైతం సాహో మాత్రమే ఆడాలని…మరో సినిమాకు అవకాశం లేకుండా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారుట.
దీనిలో భాగంగా తెలుగు రాష్ర్టాల్లో ఉన్న థియేటర్ల్ యాజమాన్యాలు, డిస్ర్టిబ్యూటర్లు, బయ్యర్లు అందరితో మంతనాలు జోరుగా చేస్తున్నారుట. వీళ్లందరికీ ప్రత్యకంగా యూవీ క్రియేషన్స్ గ్రాండ్ గా ఓ పార్టీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సినిమా రిలీజ్ కు వారం రోజుల ముందుగా ఈ కార్యక్రమం ఉంటుందని సమాచారం. యూవీ కొన్ని చోట్ల సొంతంగా రిలీజ్ చేస్తున్నా మరికొన్ని చోట్ల అమ్మేసింది. దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి వాళ్లు బిజినెస్ పర్సస్ లో ఇంకొన్ని చోట్ల రిలీజ్ చేస్తున్నారుట. ఇంత హంగామా దేనికి అంటే? పెట్టిన పెట్టుబడిని కేవలం రెండు రోజుల్లోనే తీసుకురావాలని దీని వెనుకున్న పెద్ద ప్లాన్ అని అంటున్నారు. సాధారంణగా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మూడు నుంచి నాలుగు రోజులు సమయం పడుతుంది. అదీ హిట్ టాక్ వస్తే.
సినిమాపై ఏమాత్రం నెగిటివ్ టాక్ వచ్చినా నెక్స్ట్ డే నుంచి థియేటర్ లో ఆ సినిమా ఉండదు. ఇందులో బయ్యర్లు కూడా ఉంటారు కాబట్టి తేడా కొడితే సినిమా ఆర్డర్ మారిపోతుంది. అలాంటి పరిస్థితులు సాహోకు తలెత్తకూడదనే చిన్న పాటి డిస్ర్టిబ్యూషన్ నుంచి పెద్ద కంపెనీల వరకూ అందర్నీ మచ్చిక చేసుకునే కార్యక్రమం పెట్టినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఫలితాలు తేడా గా ఉన్నా…రెండు రోజులు జనాల మీద రుద్దినా కొంత వరకూ నష్టాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. సినిమా బడ్జెట్ 300 కోట్లు. బాహుబలితో ప్రభాస్ కు వచ్చిన క్రేజ్ కారణంగా యూవీ క్రియేషన్స్ నమ్మకంగా అంత ఖర్చు పెట్టి సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.