థియేటర్‌లో కన్నీరు పెట్టుకున్న హీరోయిన్ సదా..

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సదా..తేజ ‘జయం’ పిక్చర్ తో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ‘వెళ్లవయ్యా వెళ్లు’ అని సదా ఇందులో చెప్పే డైలాగా ఇప్పటికీ జనాలకు గుర్తుంది. సదా..తర్వాత కాలంలో పలు తెలుగు చిత్రాలు చేసి తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది.

ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ తాజాగా టాకీసులో కన్నీరు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా వైరలవుతోంది. వివరాల్లోకెళితే..టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన ‘మేజర్’ సినిమాను థియేటర్లో చూసింది సదా.


ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ బయోపిక్‌గా తెరకెక్కిన ‘మేజర్‌’ చూసి ప్రతీ ఒక్కరు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు.

తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సదా భావోద్వేగానికి గురైంది. ఈ క్రమంలోనే థియేటర్ లోనే కంటతడి పెట్టుకుంది. ఉగ్రదాడి జరిగిన సమయంలో తను ముంబైలోనే ఉన్నానని గుర్తు చేసుకుంది. మూవీ చూస్తుంటే ఆనాటి రోజులు గుర్తుకువచ్చాయని తెలిపింది. అడివి శేష్ అత్యద్భుతంగా నటించాడని ప్రశంసించింది. సినిమా చూస్తున్న టైమ్ లో రొమాలు నిక్కబొడుచుకున్నాయని పేర్కొంది.

 

View this post on Instagram

 

A post shared by Major (@majorthefilm)