సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమాకు క‌ష్టాలు.. థియేట‌ర్లో క‌ష్ట‌మేనా?

ఈ క‌రోనా మ‌హ‌మ్మారి సినిమా ఇండ‌స్ట్రీని ఏ స్థాయిలో దెబ్బ తీసిందో చూస్తూనే ఉన్నాం. ఇప్ప‌టికే చాలా సినిమాలు రిలీజ్ డేట్‌ను వాయిదా వేసుకున్నాయి. ఇక పెద్ద సినిమాలు కూడా వాయిదాల బాట ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే ఆర్ ఆర్ ఆర్‌, ఆచార్య‌, స‌ర్కారువారి పాట‌, ట‌క్ జ‌గ‌దీశ్‌లాంటి పెద్ద సినిమాలు కూడా విడుద‌ల తేదీల‌ను వాయిదా వేసుకున్నాయి.

ఇక మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమాకు కూడా క‌రోనా క‌ష్టాలు త‌ప్ప‌ట్లేదు. ఆయ‌న మూవీ రిపబ్లిక్ కూడా ఓటీటీలో విడుదల కానునన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. దేవా కట్ట ఈ సినిమాకు డైరెక్ష‌న్ నిర్వ‌హించారు.

ఇక సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది. ఇక ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ముందుగా అనుకున్న ప్ర‌కారం. ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయాల్సింది. కానీ క‌రోనా కార‌ణంగా వాయిదా పడింది. ఇక ఇలాంటి స‌మ‌యంలో ఓటీటీ సంస్థలు మంచి ఆఫర్లను అందిస్తుండడంతో.. రిపబ్లిక్ మేకర్స్ కూడా ఓటీటీలో సినిమా విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. పూర్తిగా తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..