సాయి పల్లవి ఫ్యాన్స్ కి ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ సూపర్బ్ ..!

-

చిత్ర పరిశ్రమలో 90% మంది హీరోయిన్స్ అన్ని రకాల పాత్రలు చేస్తారు. రంగుల ప్రపంచంలో వీలైనంత అందంగా కనిపించడానికి తాపత్రయపడుతుంటారు. ఇక ట్రెండ్ కి తగ్గట్టు ఫాలో అవుతుంటారు. యంగ్ హీరోలౌ సీనియర్ హీరోలు అన్న తేడా లేకుండా అవకాశం వచ్చిన ప్రతీ సినిమాలోను తన సత్తా చాటుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. గ్లామర్, ఎక్స్‌ఫోజింగ్, లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్, బోల్డ్ మూవీస్ ..ఇలా ఎలాంటి వాటికైనా సై అంటుంటారు.

 

కాని వీటన్నిటికి కాస్త దూరంగా ఉంటుంది సాయి పల్లవి. తను చేసిన సినిమాలు, ఎంచుకున్న పాత్ర‌లే తన మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలుపుయి. ఫిదా సినిమాతో తెలుగులో సాయి పల్లవికి ఎంతటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత వచ్చిన నాని ఎం.సి.ఏ కూడా తన సత్తా ఏమిటో చూపించింది. ఇక ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య తో సాయి పల్లవి లవ్ స్టోరీ అన్న సినిమాలో చేస్తుంది. ఈ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉండగా ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ తో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

అంతేకాదు ఈ సినిమాతో పాటు రానా దగ్గుబాటి హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమాలోలో సాయిపల్లవి ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ రోజు సాయి పల్లవి పుట్టిన రోజు సందర్భంగా ఇలా సినిమాలో తన లుక్ ని రివీల్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇదే సర్‌ప్రైజ్ సాయి పల్లవి ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తోంది. ‘నీదీ నాదీ ఒకే క‌థ’ ఫేమ్ వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్న ‘విరాట‌ప‌ర్వం’ సినిమాని డి. సురేష్‌బాబు స‌మ‌ర్పణలో శ్రీల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రియమణి మరో హీరోయిన్ గా నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news