సపోర్టింగ్ యాక్టర్ పక్కన సాయి పల్లవి?

-

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులని ఫిదా చేసిన సాయి పల్లవి, వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది. ప్రస్తుతం సాయి పల్లవి హీరోయిన్ గా విరాట పర్వం రిలీజ్ కి రెడీ అవుతుంది. తెలుగులోనే కాకుండా తమిళం, మళయాలం భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఉంటున్న సాయి పల్లవి, తన నెక్స్ట్ చిత్రంలో సపోర్టింగ్ యాక్టర్ పక్కన నటించనుంది. తమిళంలో కమెడియన్ గా దూసుకుపోతున్న కాళి వెంకట్ హీరోగా రూపొందుతున్న సినిమాకి సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారట.

ఈ మేరకు చిత్రబృందం సాయి పల్లవిని సంప్రదించారట. సాయి పల్లవి ఒప్పుకోవడమే ఆలస్యం అని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఒప్పుకుంటే గనక కొత్త చరిత్ర సృష్టించినట్లు అవుతుంది. స్టార్ హీరోయిన్ గా ఉంటూ సపోర్టింగ్ యాక్టర్ పక్కన నటించడం అంటే చిన్న విషయం కాదు. మరి సాయి పల్లవి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news