ఈ ఏడాది గుడ్ న్యూస్ చెప్పనున్న సాయి పల్లవి..?

-

తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి ఫిదా సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యింది సాయి పల్లవి. తన మొదటి చిత్రంతోనే ఎంతోమంది కుర్రకాలను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు అందుకొని స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఒకానొక సమయంలో ఇమే స్టార్ హీరోలకి నో చెప్పే అంత బిజీ హీరోయిన్గా పేరుపొందింది. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించి ప్రత్యేకంగా ఆకట్టుకుంది.అందుచేతనే ఎప్పుడు కూడా విభిన్నమైన కథ నేపథ్యంలో ఉండే చిత్రాలలోనే నటిస్తూ ఉంటోంది.

అలాగే సినిమాలలో కంటిన్యూ చేస్తుంది అనుకున్న సాయి పల్లవి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది.ఈ మధ్య సినిమాలలో నటించకపోవడంతో ఈమె పైన పలు రకాలుగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక సాయి పల్లవి సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది ..డాక్టర్ కాబోతోంది అనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. మరి కొంతమంది ఇమే వివాహం చేసుకోవడానికి సిద్ధమైందంటూ కూడా వార్తలు వినిపించాయి. అయితే తాజాగా సాయి పల్లవి అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సాయి పల్లవి కోలీవుడ్ లో ఒక సినిమాని ఇటీవలే ఓకే చేసిందని తెలుగులో మాత్రం అసలు సినిమాలు సినిమాలు చేయలేదని అభిమానులు సైతం తెగ ఫీల్ అవుతున్నారు. సాయి పల్లవి సన్నిహితుల దగ్గర నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం సాయి పల్లవి ఈ ఏడాది ఒక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. సాయి పల్లవికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఏకంగా రూ .2 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కూడా నిర్మాతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా విషయంపై కూడా స్పందించనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news