బాలీవుడ్ ఖాన్ త్రయంలో సల్మాన్ ఖాన్ మినహా మిగతా ఇద్దరు పెద్దగా సినిమాలు చేయట్లేదనే చెప్పాలి. అటు ఆమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా సినిమా మొదలెట్టి సంవత్సరాలవుతున్నా ఇంకా ప్రేక్షకుల ముందుకు తీసుకురావట్లేదు. ఇటు షారుక్ ఖాన్, చాలా రోజుల తర్వాత ఇటీవలే సినిమా మొదలెట్టాడు. సల్మాన్ ఖాన్ ఒక్కడే ఏడాదికొక్క సినిమాతో ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నుండి రాధే చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది.
ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమా హోల్ సేల్ హక్కులు అమ్ముడుపోయాయట. ప్రఖ్యాత ఓటీటీ ఛానెల్ జీ స్టూడియోస్, రాధే సినిమాని 230కోట్లకి కొనుక్కుందట. థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ హక్కులన్నీ జీ స్టూడియోస్ కే సొంతమట. ప్రస్తుతం థియేటర్లు యాభై శాత్ం కెపాసిటీతో నడుస్తున్నందున ఇప్పుడే థియేట్రికల్ రిలీజ్ చేయట్లేదట. వందశాతం సీటింగ్ కెపాసిటీకి ప్రభుత్వం నుండి అనుమతి రాగానే థియేటర్లలో వేస్తారట. మొత్తానికి కరోనా కాలంలో సల్మాన్ సినిమాకి సాలిడ్ రేట్ రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.