టాలీవుడ్ క్రేజీ పెయిర్ నాగ చైతన్య సమంతలు ఇద్దరు ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వారి పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు స్టార్ హీరోయిన్ గా మాత్రమే ఉన్న సమంత ఇప్పుడు అక్కినేని కోడలిగా అదరగొడుతుంది. పెళ్లి తర్వాత ఏ హీరోయిన్ కు అయినా క్రేజ్ తగ్గుతుంది కాని పెళ్లి తర్వాత కూడా అదే రకమైన క్రేజ్ తెచ్చుకోవడం అందరికి సాధ్యం కాదు కాని సమంత మాత్రం పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గట్లేదు.
ముఖ్యంగా పెళ్లి తర్వాత సమంత ఫోటో షూట్స్ విషయంలో రెచ్చిపోతుంది. అయితే తన ఫోటో షూట్స్ విషయంలో నాగ చైతన్య కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశాడట. కాని తనకు నచ్చిన పనిని చేయడంలో ఇతరులు ఏం చెప్పినా పట్టించుకోనని అంటుంది సమంత. ఇక తన మీద వచ్చే ట్రోల్స్ ను అసలు పట్టించుకోనని చెబుతున్న సమంత ప్రస్తుతం సూపర్ డీలక్స్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర చేస్తుంది.