Samantha: రెమ్యునరేషన్‌పై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

-

సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల రెమ్యునరేష్ మధ్య ఉన్న తేడా గురించి చాలా ఏళ్ల నుంచి డిబేట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ఇప్పటికే చాలా మంది తారలు స్పందించారు. తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత స్పందించింది. ‘శాకుంతలం’ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సామ్‌ నటీనటుల రెమ్యునరేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

‘‘నేను ప్రత్యక్షంగా కాకపోయినా ఈ విషయంపై పోరాడుతున్నాను. అలాగని సమానంగా పారితోషికం ఇవ్వాలని నేను పోరాతున్నట్లు కాదు.. కష్టాన్ని చూసి రెమ్యునరేషన్‌ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.  నా శ్రమ చూసి ‘మేము మీకు ఇంత పారితోషికం ఇవ్వాలనుకుంటున్నాం’ అని సినిమాకు చెందిన వాళ్లే చెప్పాలి. అంతేకానీ  నాకు ఇంత రెమ్యునరేషన్‌ ఇవ్వండి అని నేను యాచించాల్సిన అవసరం లేదు. మన కృషి ఆధారంగా ఇది వస్తుందని నేను నమ్ముతాను. ఎప్పటికప్పుడు మన సామర్థ్యాలను పెంచుకుంటూ పోవాలి’’ అని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news