అభిమానులకు శుభవార్త చెప్పిన సమంత

-

అభిమానులకు శుభవార్త చెప్పింది నటి సమంత. ఈమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి గురించి స్పందించింది సమంత. తాను ఇప్పుడిప్పుడే మయోసైటిస్ నుంచి కోలుకుంటున్నాను అని.. గత కొద్ది రోజులుగా తాను అనారోగ్యంతో ఉన్నానని తెలిపింది. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని తెలిపింది.

ప్రస్తుతం ఆరోగ్యం మెరుగుపడడంతో తాను బయటకు రాగలుగుతున్నానని చెప్పింది. శాకుంతలం మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆమె ఈ విషయాలను వెల్లడించింది. అయితే గత అక్టోబర్ లో సమంత మయోసైటిస్ తో బాధపడిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఇంకా చావలేదని.. బ్రతికే ఉన్నానని ఫాన్స్ ను ఎమోషనల్ చేసింది. ఇక ప్రస్తుతం నాన్ వెజ్ కూడా మానేసినట్లు చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news