రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాలి – జీవీఎల్

-

దళిత క్రైస్తవులను ఎస్సీలలో చేరుస్తూ అసెంబ్లీ తీర్మానం చేయడం రాజ్యాంగ వ్యతిరేక చర్యగా అభివర్ణించారు బిజెపి ఎంపీ జేవీఎల్ నరసింహారావు. ఈ నిర్ణయం కారణంగా నిజమైన ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ తీర్మానం చేశారని ఆరోపించారు జీవీఎల్. ఇలాంటి రాజకీయ ప్రయత్నాలను బిజెపి వ్యతిరేకిస్తుందని అన్నారు.

ఇక రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జీవీఎల్. నోటి దురుసు, అహంకారంతో కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్లుగా దూషణలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సామాజిక వర్గం అంతా దొంగలు అనడం రాహుల్ గాంధీ అహంకారపూరిత వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి ఎప్పుడైనా ముప్పు వాటిల్లిందంటే అది కాంగ్రెస్ పార్టీ హయాంలోనేనని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news