Samanatha: స‌మంత జోరు మామూలుగా లేదుగా.. టాలీవుడ్ టు హలీవుడ్ !

-

Samanatha: నాగ‌చైత‌న్య‌తో విడిపోయాక‌..సమంత త‌న కెరీర్ పై మ‌రింత ఫోక‌స్ పెంచింది. వ‌రుస‌గా సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుంది. ఇప్ప‌టికే రెండు క్రేజీ ప్రాజెక్టులపై సైన్ చేసిన ఈ అమ్మ‌డు. ఈ క్ర‌మంలో స్పెష‌ల్ సాంగ్స్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుంది. తాజాగా `పుష్ప‌`లో ఓ ఐటెమ్ సాంగ్ లో న‌టించ‌డానికి ఒప్పుకుని .. త‌న అభిమానుల‌ను షాక్ చేసింది. సుకుమార్ మీద ఉన్నా.. అభిమానంతోనే ఈ క్రేజీ సాంగ్ కు ఒప్పుకున్న‌ట్టు తెలుస్తుంది.


ఇవన్నీ ఇలా వుండగానే ఇప్పుడూ హాలీవుడ్ సినిమాలో న‌టించేందుకు సిద్ద‌మ‌న‌ట్టు టాక్ వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో ఓ క్రేజీ అప్డేట్ ఫీల్మ్ న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతుంది. `అరెంజ్ మెంట్స్ ఆఫ్ ల‌వ్‌` అనే సినిమాలో స‌మంత కీల‌క పాత్ర పోషిస్తోంద‌ట‌. ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాత సునీత తాటి నిర్మిస్తుంది. ఈ చిత్రానికి ఫిలిప్ జాన్ దర్శక‌త్వం వ‌హిస్తున్నాడు.రచయిత తిమెరి ఎన్ మురారి నవల అయిన ది అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

‘అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’ అనే ఈ సినిమా షూటింగ్ కొంత భాగం.. భార‌త్ లోనూ.. మ‌రికొంత భాగం వేల్స్ లో షూటింగ్ జరుపుతారు. గ‌తంలో సునీత తాటి నిర్మించిన ఓ బేబీ సినిమా స‌మంత న‌టించి, మెప్పించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు శాకినీ ఢాకినీ సినిమా నిర్మాణంలో వుంది. గతంలో సునీత తాటి నిర్మించిన సినిమాల్లో సురేష్ మూవీస్ భాగస్వామ్యం వుంది. మరి ఈ ఇంటర్నేషనల్ సినిమాలో కూడా అది కొనసాగుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news