అవునా.. నేను తల్లిని కాబోతున్నానా? మీకెప్పుడు తెలిసింది: సమంత

-

సమంత ప్రెగ్నెంట్ అంటూ ట్విట్టర్ లో వైరల్ అవుతున్న ఓ ట్వీట్ ను రీట్వీట్ చేసిన సామ్.. అవునా.. సమంత ప్రెగ్నెంటా? మీకెప్పుడు తెలిసిందో కాస్త చెబుతారా? అంటూ సెటైరికల్ గా ట్వీట్ చేసింది.

సమంత రుతుప్రభు కాస్త సమంత అక్కినేని అయింది. తాజాగా బేబీ అక్కినేని అయింది. అవును.. సమంత ట్విట్టర్ అకౌంట్ ను చెక్ చేయండి.. ఆమె పేరు బేబీ అక్కినేని అని ఉంటుంది. ఎందుకంటే.. సమంత ప్రస్తుతం ఓ బేబీ అనే సినిమాలో నటిస్తోంది. అందుకే.. ఆమె తన పేరును బేబీగా మార్చుకుంది.

అయితే.. ఆమె బేబీ అక్కినేని అని పేరు మార్చుకోవడంతో సమంత.. ప్రెగ్నెంట్ అయినట్టుంది.. అందుకే బేబీ అని తన పేరును మార్చుకున్నది.. అంటూ సోషల్ మీడియా, కొన్ని వెబ్ సైట్లు కోడై కూశాయి. వాటిపై సమంత స్పందించింది.

సమంత ప్రెగ్నెంట్ అంటూ ట్విట్టర్ లో వైరల్ అవుతున్న ఓ ట్వీట్ ను రీట్వీట్ చేసిన సామ్.. అవునా.. సమంత ప్రెగ్నెంటా? మీకెప్పుడు తెలిసిందో కాస్త చెబుతారా? అంటూ సెటైరికల్ గా ట్వీట్ చేసింది. దీంతో.. ఆమె ప్రెగ్నెంట్ కాదు.. గిగ్నెంట్ కాదు.. కేవలం తన సినిమా ప్రమోషన్ కోసం ఇలా బేబీ అని పేరు మార్చుకుంది అని తెలుసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news