రాధారవిపై సమంత షాకింగ్ ట్వీట్.. టికెట్ పంపిస్తా సినిమా చూడండి..!

-

కోలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ నయనతారపై రాధా రవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా సంచలనంగా మారాయి. నయనతార దెయ్యంగా నటిస్తుంది.. సీతగా మెప్పిస్తుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాధా రవి తగిన మూల్యం చెల్లించుకుంటున్నాడు. ఇప్పటికే నడిగర్ సంఘం అతని మీద సీరియస్ అవగా.. సెలబ్రిటీస్ కూడా రాధా రవి మీద ఫైర్ అవుతున్నారు. ఇక వారిలో సమంత కూడా విచిత్రంగా రాధారవి పై షాకింగ్ ట్వీట్ చేసింది.

ఇంతకీ సమంత ఏమని ట్వీట్ చేసింది అంటే.. మిస్టర్ రాధా రవి కష్టమనేది ఎప్పటికి అలానే ఉంటుంది.. ప్రస్తుతం మీరు బాధలో ఉన్నారనిపిస్తుంది.. మిమ్మల్ని చూస్తుంటే మా అందరికి బాధేస్తుంది.. మీకు ప్రశాంతత రావాలని కోరుకుంటూ నయనతార తర్వాత సినిమా టికెట్స్ మీకు పంపిస్తా మీరు పాప్ కార్న్ తింటూ సినిమా చూడండి అని మెసేజ్ చేసింది. తమ సహనటిని అంటే ఎవరం ఊరుకోమని నయనతారకు సపోర్ట్ గా నిలుస్తున్న తమిళ స్టార్స్ ను చూసి ఆ సెలబ్రిటీస్ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.

ఇక తాను చేసిన వ్యాఖ్యలు ఇలా వివాదాస్పదం అవుతాయని ఊహించని రాధా రవి తాను ఎలాంటి చెడు ఉద్దేశంతో అలా అనలేదని.. విఘ్నేష్ తన వద్దకు వస్తే తాను వివరించి చెబుతా లేదా తానైనా వచ్చి అసలు తను ఏ ఉద్దేశంతో అన్నానో చెబుతా అని కప్పిపుచ్చేలా మాట్లాడుతున్నారు. అయితే చేయాల్సింది అంతా చేసి ఇప్పుడు తాను అలా అనలేదు అంటే ఎలా కుదురుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news