మరొకసారి షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత.. నాకు అదే ముఖ్యం..!!

-

తెలుగు, తమిళ్ భాషలలో అగ్ర కథానాయకిగా పేరుపొందింది హీరోయిన్ సమంత. సమంత ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించి విపరీతమైన క్రేజ్ ను అందుకుంది. ఈ మధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజాగా సమంత నటించిన యశోద చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాలతో పాటు శాకుంతలం , ఖుషి వంటి చిత్రాలలో నటించింది. ఈ చిత్రాలు కూడా భారీ బడ్జెట్లోనే నిర్మించాలని చిత్ర బృందం.

గడచిన కొద్ది రోజుల క్రితం నుంచి సమంత మయోటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ వ్యాధి పైన వైద్య చికిత్స పొందుతున్న సమంత కోసం ఖుషి సినిమా చిత్ర యూనిట్ ఎదురుచూస్తోంది. ఇలాంటి సమయంలో ఈమె ఇటీవల ఒక భేటీలో తన మనోభావాలను పంచుకోవడం జరిగింది.అందులో ఆమె పేర్కొంటూ తనకు కోపం వచ్చినప్పుడు ఎక్కువగా జిమ్ములో వెళ్లి ఇస్టాను సారంగా వ్యాయామం చేస్తూ ఉంటానని తెలియజేసింది. ఆ తర్వాతే తనకి కోపం తగ్గుతుందని తెలుపుతోంది సమంత.

ఎలాంటి సమయంలోనైనా సరే తాను డబ్బుకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వనని తెలియజేస్తోంది. తనకు డబ్బు ముఖ్యం కాదని నటనే ముఖ్యమని తెలుపుతోంది. తాను చేసే ప్రతి పాత్రలో కూడా ఆ పాత్రను ఆస్వాదిస్తానని అలా నటించకపోతే అందులో ఎలాంటి సంతోషం ప్రయోజనం ఉండదని తెలియజేస్తోంది సమంత. ఇలాంటి సమయంలో తనమీద తానే విమర్శకురాలనౌ వుతానని తెలిపింది. వృత్తిలో కాలం కలిసి రాకపోతే ఏది జరగదని తెలియజేస్తోంది. అలాంటి సమయంలో చింతించకుండా ఎక్కువగా ఆలోచించకుండా నిద్రపోతానని తెలియజేస్తోంది సమంత.

Read more RELATED
Recommended to you

Latest news