పవన్ కళ్యాణ్ టిడిపిలోనో, బిజెపి లోనే ఉంటే ఈపాటికి మంత్రి అయిపోయేవాడు.. మెగా బ్రదర్ నాగబాబు..

-

మెగా బ్రదర్ నాగబాబు ఎప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు ఏకపక్షంగా నిలబడుతూనే వస్తున్నారు అయితే తాజాగా ఈయన పవన్ కళ్యాణ్ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం తన రాజకీయ జీవితం కోసం కొన్ని వ్యాఖ్యలు చేశారు.. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గణ రాసిన ‘‘ ద రియల్ యోగి’’ అనే పుస్తకాన్ని నాగబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ టిడిపిలోనూ బిజెపి లోను చేరి ఉంటే ఈపాటికి మంత్రి అయ్యి ఉండేవారని కానీ పవన్ కు పదవులపై ఎలాంటి మక్కువ లేదంటూ చెప్పుకొచ్చారు.. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం మాత్రమే అతనికి ఉందని అందుకే జనసేన పార్టీని స్థాపించారని అన్నారు.. కోట్లాదిమందికి సాయం చేయాలని ఉద్దేశం తప్ప తనకు ఇంకేమీ లేదని అయితే పవన్ తన సొంత తమ్ముడు కాబట్టి అతని గురించి ఇంకా ఏమి చెప్పలేకపోతున్నాను అంటూ చెప్పకు వచ్చారు నాగబాబు..

అలాగే త్వరలోనే మెగా ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్ వైపు నిలబడనున్నట్టు కూడా తాజాగా జరుగుతున్న చాలా విషయాలు చెబుతూనే ఉన్నాయి. అయితే గత నెలలో మెగాస్టార్ చిరంజీవి తను చదువుకున్న వైన్ మూర్తి కాలేజ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సభకు హాజరైన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏదైనా అనుకుంటే అది తప్పకుండా చేస్తాడని.. అనుకున్నవన్నీ చేశాడని అన్నారు.. అయితే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏదో అనుకొని వచ్చానని కానీ ఇందులోకి వచ్చాక అందర్నీ మాటలు అనాలని పడాలని ఇవన్నీ తన వల్ల కాదు అనుకుంటూ బయటకు వచ్చానని కానీ పవన్ కళ్యాణ్ వీటన్నిటికీ అతీతంగా ఉంటూ ప్రజలకు ఏదో సాయం చేయాలి అన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు..

ఇదిలావుండగా.. కొద్దిరోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత నెలలో తాను చదువుకున్న వైఎన్ మూర్తి కాలేజ్ పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరు మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ అనుకుంటే చేస్తాడన్నారు. తాను అనుకున్నవి అన్నీ చేసేశానని.. తనకు కష్టాన్ని, పనితనాన్ని నేర్పించి ఎన్‌సీసీనే అని ఆయన గుర్తుచేసుకున్నారు. కాలేజీలో వేసిన నాటకంతో సినీ పరిశ్రమలోకి వచ్చానని.. అప్పటి నుంచి అనుకున్న దాన్ని అంతుచూడటం నేర్చుకున్నానని చిరంజీవి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news