బోల్డ్ ఫొటోలతో ఎన్టీఆర్ హీరోయిన్ రచ్చ… ట్రోలర్స్​కు ధీటైన సమాధానం

మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి స్టార్స్​తో స్క్రీన్ షేర్ చేసుకున్న అందాల భామ సమీరా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది. తెలుగులో ఆమె కొన్ని సినిమాల్లో మాత్రమే నటించినప్పటికీ అప్పట్లో మంచి పేరు తెచ్చుకుంది. నరసింహుడు, అశోక్, జై చిరంజీవ లాంటి చిత్రాల్లో గ్లామర్ ఒలకబోసి యువతలో క్రేజ్ సంపాదించింది. హీరోలతో సమానంగా డాన్స్ చేయగల నటిగాను గుర్తింపు తెచ్చుకుంది.

అయితే ఇక వివాహం తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ అక్షయ్​ను సమీరా రెడ్డి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం. వివాహం తర్వాత సమీరా రెడ్డి బరువు సమస్యలు ఎదుర్కొంది. దీంతో తన రూపం మారిపోవడంతో ట్రోలింగ్ ఎదుర్కొంటుంది. అయితే తాజాగా ఈ ట్రోలింగ్​ఫై స్పందించింది. నా బాడీ నా ఇష్టం అంటూ ట్రోలర్స్​కి ఘాటుగా బదులిచింది. దీంతో పాటే సమీరా రెడ్డి ఇన్​స్టాగ్రామ్​లో మేకప్ లేకుండా హాట్ ఫొటోస్ పోస్ట్ చేసింది. తన శరీరాన్ని తాను ఇష్టపడుతున్నాను అంటూ సమీరా రెడ్డి ఈ ఫోటోషూట్ పోస్ట్ చేసింది.

ఇందులో సమీరా డ్రెస్​పై ధరించి ఉన్న బ్లూ జాకెట్ రిమూవ్ చేస్తూ బోల్డ్​గా కనిపిచింది. అలాగే చీపురు పట్టుకుని వయ్యారంగా ఊడ్చిన ఫోజులు ఇచ్చింది. అవి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera)

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera)