మత్తు కళ్ళతో మాయ చేస్తూ కవ్విస్తున్న సంయుక్త మీనన్..!

-

యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ గ్లామర్ కు యువత ఫిదా అయిపోతున్నారు. టాలీవుడ్లో భీమ్లా నాయక్ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈమె ఆ తర్వాత తన గ్లామర్ తో పాటు నటన, అభినయంతో యువతను తనవైపు తిప్పుకుంది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమాలో కూడా నటించి మెప్పించిన ఈమె మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. టైం ట్రావెల్ నేపథ్యంలో సాగిన ఈ బింబిసారా చిత్రంలో సంయుక్త మీనన్ , కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్గా నటించి మెప్పించింది. ఇకపోతే టాలీవుడ్లోకి అడుగుపెట్టగానే ఈమెకు వరుసగా విజయాలు దక్కుతున్నాయి.

Samyuktha (@iamsamyuktha_) / Twitter

ఇటీవల ధనుష్ సార్ సినిమాలో కూడా నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొత్తానికైతే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలోనే హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు సినిమాలు.. మరొకవైపు సోషల్ మీడియా అంటూ అభిమానులకు ఎప్పటికప్పుడు దగ్గరవుతోంది. తాజాగా సంయుక్త లేటెస్ట్ ఫోటోషూట్ షేర్ చేయగా అందులో చాలా క్యూట్ గా కనిపిస్తోంది. మత్తు కళ్ళతో మ్యాజిక్ చేసే విధంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈమె కళ్ళల్లో ఏదో మాయ ఉంది అంటూ అభిమానులు చాలా తీక్షణంగా ఫోటోలను చూస్తున్నారు.

మొత్తానికి అయితే గ్రీన్ కలర్ డ్రెస్ లో తన అందచందాలతో యువతను ఇట్టే ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ప్రేక్షకులను తన సినిమాలతో ఆకట్టుకుంటూనే మరొకవైపు గ్లామర్ ఫోటో షూట్లతో మరింత మెస్మరైజ్ చేసే పనిలో పడింది. ఏది ఏమైనా సంయుక్త అందానికి యువత ఫిదా అవుతున్నారనడం లో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news