ఇండియాలో క్రికెట్.. బాలీవుడ్ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇప్పటికే ఈ కాంబోలో చాలా మంది ప్రేమించి పెళ్లాడి.. హాయిగా జీవితం సాగిస్తున్నారు. ఇక ఈ లిస్టులో గత కొంతకాలంగా బాలీవుడ్ స్టార్ కిడ్ సారా అలీఖాన్ పేరు వినిపిస్తోంది. ఈ బ్యూటీ యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో ప్రేమలో ఉన్నట్లు చాలాకాలం నుంచి రూమర్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై సారా స్పందించింది. క్రికెటర్‌ను పెళ్లి చేసుకోవడంలో తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. అయితే, ఒక కండిషన్ మాత్రం పెట్టింది.
‘‘నా మానసిక, ఆధ్యాత్మిక విలువలకు సరితూగే వ్యక్తి దొరికినప్పుడు తప్పకుండా అతడితో జీవితాన్ని మొదలుపెడతాను. అతడు ఏ రంగానికి చెందిన వాడనేది పెద్దగా పట్టించుకోను. క్రికెటర్, నటుడు, వ్యాపారవేత్త.. ఇలా రంగం ఏదైనా పర్వాలేదు. నా విలువలను గౌరవిస్తే చాలు. ’’ అని చెప్పుకొచ్చింది. ఇక తాను ఓ క్రికెటర్‌తో డేటింగ్లో ఉన్నానంటూ వస్తోన్న వార్తలపై స్పందిస్తూ.. ‘‘నా జీవిత భాగస్వామిని నేనింకా కలవలేదు. కలిశానని కూడా అనుకోవడం లేదు. ఇది మాత్రం పూర్తి భరోసాతో చెబుతున్నా’’ అంటూ అసలు సంగతి బయటపెట్టింది.