చివరి కోరిక తీరకుండానే స్వర్గస్తులైన శరత్ బాబు..!

-

విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న శరత్ బాబు 71 సంవత్సరాల వయసులో స్వర్గస్తులయ్యారు. గత మూడు నెలల క్రిందట అనారోగ్యానికి గురైన ఆయన చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా పరిస్థితి విషమించడంతో బెంగళూరు వెళ్లారు. అయితే అక్కడ పరిస్థితి మరింత అస్వస్థకు గురి కావడంతో గత నెల 20వ తేదీన ఆయనను బెంగళూరు నుంచి హైదరాబాద్లోని ఏఐజి హాస్పిటల్ కు తరలించడం జరిగింది. ఇక ఆయన శరీరంలో ఇన్ఫెక్షన్ వ్యాపించడంతో ఊపిరితిత్తులు, కాలేయం ఇతర అవయవాలు దెబ్బతినగా వెండిలేటర్ పైన ఆయనకు చికిత్స అందిస్తూ వచ్చారు వైద్యులు.

అయితే ఇక మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అవడంతో సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూశారు. ఇకపోతే 230 కి పైగా చిత్రాలలో నటించిన ఈయన చివరి కోరిక తీరకుండానే మరణించడం నిజంగా బాధాకరమని చెప్పాలి. ఇకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తమిళ్ లో శరత్ బాబు చేసిన చివరి సినిమా వసంతముల్లై.. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా విడుదలకు సిద్ధం కానుంది. మరొకవైపు తెలుగులో నరేష్ హీరోగా నటించిన మళ్లీ పెళ్లి సినిమాలో కూడా శరత్ బాబు కీలకపాత్ర పోషించారు.

ఇక తెలుగులో ఆయనకు చివరి చిత్రం ఇదే కావడం గమనార్హం. ఇకపోతే ఆయనకు చిరకాల కోరిక ఏమిటంటే వ్యక్తిగతంగా హార్సిలీ హిల్స్లో స్థిరపడాలనేది ఆయన చివరి కోరిక. అక్కడ ఇంటి నిర్మాణం కూడా చేపట్టారు. అయితే ఆ నిర్మాణం ఇంకా పూర్తికాలేదు.
ఇక ఆ ఇంటి నిర్మాణం పూర్తవ్వకనే ఆయన స్వర్గస్తులవడం నిజంగా బాధకి గురిచేస్తుంది. ఈ విషయం తెలిసిన అభిమానులు, సెలబ్రిటీలు చివరి కోరిక తీరకుండానే స్వర్గస్తులయ్యారు అంటూ మరింత బాధపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news