ప్రిన్స్ మహేష్‌బాబు సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ లుక్‌తోనే చంపేశాడు. టాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకుపోతోన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ నటిస్తోన్న ఈ సినిమాకు ఇద్దరు అగ్ర నిర్మాతలు దిల్ రాజు – అనిల్ సుంకర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక మహర్షి లాంటి హిట్ సినిమా తర్వాత మహేష్‌బాబు నటిస్తోన్న సినిమా ఇదే కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి.
మహేష్‌తో అనిల్ రావిపూడి ఎంత ఫన్ జనరేట్ చేస్తాడన్న దానిపై ఎవరికి వారు రకరకాల డిస్కర్షన్లు పెడుతున్నారు. దూకుడు సినిమా తర్వాత మహేష్ నుంచి సరైన కామెడీ టైమింగ్‌తో సినిమా రాలేదు. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి ఆ సినిమాకు అసిస్టెంట్‌గా పనిచేసిన అనుభవంతో సరిలేరు నీకెవ్వరు సినిమాలోనూ అంతే ఫన్ జనరేట్ చేయబోతున్నాడని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా దసరా శుభాకాంక్షలు చెపుతూ రిలీజ్ అయిన స్టిల్‌లో మహేష్ గొడ్డలి పట్టుకుని యాక్షన్‌కు రెడీ అవుతూ చంపేస్తున్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో కర్నూలు కొండారెడ్డి బురుజు కొంత మంది గ్యాంగ్ ఉన్నారు. మాంచి ఫైటింగ్ మూడ్‌లో మహేష్ ఉన్నాడు. ఒక్కడు రేంజ్ స్టైల్లో సినిమా కనిపిస్తోంది. మహేష్ డ్రెస్ స్టైల్ కూడా ఎట్రాక్టివ్‌గా ఉంది. ఇక పోస్టర్‌లోనే సినిమాను 2020 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. మహేష్ సరసన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్.