వెంకీ మామ ‘ గుడ్ న్యూస్‌… రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీ మామ’. ప‌వ‌న్‌, జై ల‌వ‌కుశ సినిమాల ద‌ర్శ‌కుడు కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. మ‌రో పాట మాత్రమే షూటింగ్ చేయాల్సి ఉంది. ఇక షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమాను ముందుగా ద‌స‌రాకే రిలీజ్ చేయాల‌ని నిర్మాత‌లు భావించారు.

ద‌స‌రాకు సైరా, చాణ‌క్య లాంటి సినిమాలు పోటీలో ఉండ‌డంతో చివ‌ర‌కు వెంకీ మామ‌ను సోలోగా దింపాల‌ని డిసైడ్ అయ్యారు. ఇక ఈ సినిమా ఫ‌స్ట్ గ్లిమ్స్‌ను మంగ‌ళ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు రిలీజ్ చేయ‌నున్నారు. అదే టైంలో సినిమాను డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ అంటే డిసెంబ‌ర్ 1వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

venky-mama-release-date-update-pyzzzd

నిజ జీవితంలో మేన‌మామ, మేన‌ళ్లుల్లు అయిన వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య హీరోలుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో చైతుకు జోడీగా రాశీ ఖన్నా నటిస్తుండగా, వెంకటేష సరసన పాయల్ రాజ్ పుత్ మెరవనుంది. సినిమాలో రాశీ, పాయ‌ల్ అందాలు.. హాట్ హాట్‌గా ఉండ‌డంతో పాటు యూత్‌కు మాంచి కిక్ ఇచ్చేలా ఉంటాయ‌ని తెలుస్తోంది.

సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చాలారోజుల నుండి ఊరిస్తూ వస్తున్న వెంకీ, చైతన్యల కాంబినేషన్ కావడంతో ‘వెంకీ మామ’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.